శ్రీదేవి చివరి సినిమా చైనాలోనూ విడుదల కాబోతోంది!
- ‘మామ్’ ప్రతి ఒక్కరికీ కనెక్ట్ అవుతుంది
- అందమైన కథను అందరికీ చెప్పాలి
- వీలైనంత మందికి చూపించాలి
ఈ సినిమా విషయమై బోనీ మాట్లాడుతూ.. ‘‘మామ్’ సినిమా ప్రతి ప్రాంతంలోని తల్లులకు, ప్రేక్షకులకు కనెక్ట్ అవుతుంది. ఇది శ్రీ చివరి సినిమా. ఈ అందమైన కథను అందరికీ చెప్పి, ఆమె చివరి మధురమైన సినిమాను వీలైనంత మందికి చూపించాలనేదే మా ఉద్దేశం’ అని పేర్కొన్నారు. ఈ చిత్రాన్ని మార్చి 22న చైనాలో విడుదల చేయబోతున్నట్టు తెలిపారు.