మారుతికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన మెగా హీరో
- 'చిత్రలహరి'తో బిజీగా సాయిధరమ్ తేజ్
- గీతా ఆర్ట్స్ పై తదుపరి సినిమా
- ఏప్రిల్ తరువాత సెట్స్ పైకి
ఆయన దర్శకత్వంలో 'చిత్రలహరి' సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా చేస్తుండగానే ఆయనకి 'రాచ్చసన్' .. 'గల్లీబాయ్' రీమేకుల్లో చేసే ఛాన్స్ వచ్చింది. అయినా ఆయన వాటిపై పెద్దగా ఆసక్తిని చూపలేదు. తాజాగా మారుతి వినిపించిన ఒక కథ నచ్చడంతో .. వెంటనే ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. ఈ సినిమా గీతా ఆర్ట్స్ పై రూపొందుతుందని అంటున్నారు. ఏప్రిల్ తరువాత ఈ సినిమా సెట్స్ పైకి వెళుతుందని చెబుతున్నారు.