విజయ్ దేవరకొండ బ్రాండ్ పేరిట నకిలీ దుస్తులు.. అమెజాన్ కు కోర్టు ఆదేశాలు
- నకిలీ దుస్తుల్ని తయారు చేస్తున్న వ్యాపారస్థులు
- జనరిక్ పేరుతో అమెజాన్ దుస్తుల అమ్మకం
- బెంగుళూరు సివిల్ కోర్టులో దావా
ఈ కేసుకు సంబంధించిన పూర్తి విచారణ మార్చి 29న జరగనుంది. ఈ నేపథ్యంలో విజయ్ దేవరకొండ అసిస్టెంట్ ఆకాశ్ మీడియాతో మాట్లాడుతూ.. అమెజాన్‌లో ‘రౌడీ’ బ్రాండ్‌ను అమ్ముతున్నట్టు తమ మేనేజర్లు గుర్తించారని.. అలాగే కొందరు అభిమానులు కూడా ఈ విషయాన్ని తమ దృష్టికి తీసుకొచ్చినట్టు తెలిపారు. ఇప్పటికే హైదరాబాద్‌లో తమ బ్రాండ్‌కి సంబంధించిన నకిలీ దుస్తులు అమ్ముతున్న వ్యాపారస్థులపై చర్య తీసుకున్నామని కానీ ప్రస్తుతం ఏపీ, కర్ణాటక నుంచి సమస్య ఏర్పడిందని అన్నారు.