శ్రీదేవి బయోపిక్ లో మాధురీ దీక్షిత్?
- శ్రీదేవి బయోపిక్ కి సన్నాహాలు
- జాన్వీ కపూర్ ప్రస్తావన లేనట్టే
- మాధురీ దీక్షిత్ తో సంప్రదింపులు
అయితే శ్రీదేవి పాత్రను పోషించడం అంత సాధారణమైన విషయమేం కాదు. అద్భుతమైన హావభావాలు .. డైలాగ్ డెలివరీ .. డాన్సులు .. ఇలా అన్నింటిలోను ప్రేక్షకులను మెప్పించగల సామర్థ్యం కావాలి. అంతటి అనుభవం లేని కారణంగా జాన్వీ కపూర్ గురించిన ఆలోచన చేయడం లేదట. శ్రీదేవి పాత్రను మాధురీ దీక్షిత్ అయితే అద్భుతంగా చేయగలదనే నిర్ణయానికి వచ్చిన బోనీకపూర్, ఆమెతో సంప్రదింపులు జరుపుతున్నట్టుగా చెప్పుకుంటున్నారు. బోనీకపూర్ .. అనిల్ కపూర్ లతో గల స్నేహం కారణంగా ఆమె అంగీకరించే అవకాశాలు ఎక్కువనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.