జలీల్ ఖాన్ కు తప్పు చేశానన్న ఫీలింగే లేదు: మల్లికా బేగం ఫైర్
- మతాన్ని తన ఇష్టమొచ్చినట్టు వాడుకుంటారా?
- గతంలో జలీల్ ఖాన్ ఎమ్మెల్యేగా పోటీ చేశారు
- అప్పుడు, ఆయన భార్యాపిల్లలు బురఖాలు లేకుండా ప్రచారం చేయలేదా?
ముస్లిం మహిళలు బురఖా లేకుండా బయటకు రాకూడదు కనుక తనకు ఫత్వా జారీ చేయాలని మతపెద్దలతో జలీల్ ఖాన్ చెప్పారని ఆరోపించారు. తన రాజకీయ జీవితం దెబ్బతినడానికి జలీల్ ఖాన్ కారణమని మండిపడ్డారు. ఆరోజు ఎవరైతే తనపై ఫత్వా జారీ చేయడానికి కారణమయ్యారో, ఆయనే ఈరోజు తన కూతురుకి టికెట్ ఇవ్వమని చంద్రబాబుని అడగడం సమంజసమా? అని ప్రశ్నించారు.
మతాన్ని తన ఇష్టమొచ్చినట్టు జలీల్ ఖాన్ వాడుకుంటారా? తప్పు చేశానన్న ఫీలింగే ఆయనకు లేదని విమర్శించారు. గతంలో జలీల్ ఖాన్ ఎమ్మెల్యేగా పోటీ చేసిన సమయంలో ఆయన భార్య, పిల్లలు బురఖాలు లేకుండా ఇంటింటికీ తిరిగి ప్రచారం చేయలేదా? అప్పుడు, ముస్లిం మహిళలు బురఖాలు ధరించకుండా బయటకు వెళ్లకూడదన్న నిబంధన ఆయనకు తెలియదా? అని ఓ రేంజ్ లో ఆమె దుయ్యబట్టారు.