ప్రస్తుతానికి పెళ్లి ఆలోచన లేదు... పెళ్లి చేసుకున్నా నటన కొనసాగుతుంది: అంజలి
- తమిళంలో బిజీగా ఉన్న ఈ తెలుగు అమ్మడు
- అక్కడి నటుడితో ప్రేమలో పడిందని వార్తలు
- అటువంటిదేమీ లేదని స్పష్టీకరణ
ఇటీవల కాలంలో ఓ తమిళ నటుడితో ప్రేమలో పడిందని, అతన్ని పెళ్లాడబోతోందన్న వార్తలు షికారు చేస్తున్నాయి. దీనిపై స్పందించిన అంజలి ప్రస్తుతానికి అటువంటి ఆలోచన లేదని కొట్టిపారేసింది. కాకపోతే పెళ్లి చేసుకున్నంత మాత్రాన నటన మానేయాలని లేదంది. పెళ్లి తర్వాత నటనకు దూరమైన ఎంతోమంది హీరోయిన్లు మళ్లీ నటించేందుకు వస్తున్నప్పుడు పెళ్లయిన తర్వాత తానెందుకు ఇంట్లో కూర్చోవాలని ఎదురు ప్రశ్నిస్తోంది.