సూర్య చిత్రంలో ఛాన్స్ కొట్టేసిన పూర్ణ
- ప్రధానమంత్రిగా మోహన్ లాల్
- ప్రతినాయకుడిగా ఆర్య
- ఆగస్టులో భారీస్థాయి విడుదల
ఈ సినిమాలో ఒక కీలకమైన పాత్ర కోసం 'పూర్ణ' ను ఎంపిక చేసుకున్నారు. తెలుగులో 'సీమశాస్త్రి' .. 'అవును' తరువాత పూర్ణ చెప్పుకోదగిన సినిమాలు చేయలేకపోయింది. అప్పటి నుంచి ఆమె తమిళ సినిమాలపైనే దృష్టి పెట్టింది. ఆల్రెడీ 'కాప్పన్' షూటింగులో ఆమె పాల్గొంటోంది. ఈ సినిమా తన కెరియర్ కి చాలా హెల్ప్ అవుతుందని ఆమె భావిస్తోంది. ఆగస్టులో ఈ సినిమాను విడుదల చేసే ఆలోచనలో వున్నారు.