హీరోగా రకుల్ సోదరుడు 'అమన్' ఎంట్రీ
- తెలుగులో స్టార్ హీరోయిన్ గా రకుల్
- హీరోగా ఆమె సోదరుడు అమన్ ఎంట్రీ
- రేపు ఉదయం తొలి సినిమా లాంచ్
ఈ నేపథ్యంలోనే ఆమె సోదరుడు 'అమన్' హీరోగా ఎంట్రీ ఇవ్వడానికి రంగాన్ని సిద్ధం చేసేసుకున్నాడు. కొంతకాలంగా ఈ వార్త వినిపిస్తున్నా, అన్ని పనులు ఇప్పుడు ఒక కొలిక్కి వచ్చాయన్న మాట. 'అమన్' హీరోగా చేయనున్న ఈ సినిమాకి దర్శకుడు దాసరి లారెన్స్. రజినీ ఫిల్మ్ కార్పొరేషన్ బ్యానర్లో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. రేపు ఉదయం 10 గంటలకు హైదరాబాద్ - అన్నపూర్ణ స్టూడియోలో ఈ సినిమాను లాంచ్ చేయనున్నారు.