సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం
- సొంత చిత్రం పనుల్లో కాజల్ బిజీ
- ఆ సీక్వెల్ లో కూడా జగపతిబాబు?
- మే నెలలో రానున్న 'అక్షర'
* గతంలో జగపతిబాబు హీరోగా ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో వచ్చిన 'శుభలగ్నం' చిత్రం మంచి విజయాన్ని సాధించింది. ఇప్పుడీ చిత్రానికి సీక్వెల్ ప్లాన్ చేస్తున్నారు. ఇందులో కూడా జగపతిబాబునే ప్రధాన పాత్రకు తీసుకోవడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి.
* నందిత శ్వేత కథానాయికగా చేస్తున్న తెలుగు చిత్రం 'అక్షర'. బి.చిన్ని కృష్ణ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం హైదరాబాదులో జరుగుతోంది. చిత్రాన్ని మే నెలలో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.