బీహార్ ఇంజినీర్స్ రిక్రూట్ మెంట్ లో విచిత్రం: మెరిట్ లిస్టులో సన్నీలియోన్ టాప్!
- ప్రొవిజనల్ జాబితాలో అమ్మడి పేరు
- జనరల్ కేటగిరీలో అత్యధిక మార్కులు
- ఆకతాయి పనిగా భావిస్తున్న అధికారులు
అంతేకాదు, సదరు అభ్యర్థికి వచ్చిన మార్కులు కుడా దిమ్మదిరిగిపోయేలా ఉన్నాయి. మొత్తం 98.50 పాయింట్లు స్కోర్ చేసినట్టు ప్రొవిజనల్ లిస్టులో పేర్కొన్నారు. దరఖాస్తుదారు పేరు సన్నీ లియోన్ అని, తండ్రి పేరు లియోనా లియోన్ అని ఆ జాబితాలో ఉంది. అంతేకాదు, ఆమె అకడమిక్ పెర్ఫార్మెన్స్ కు కూడా గణనీయమైన స్థాయిలో 73.50 పాయింట్లు లభించాయి.
ఈ వ్యవహారంపై పీహెచ్ఈడీ సంయుక్త కార్యదర్శి స్పందిస్తూ... ఇది ఎవరో ఆకతాయిలు చేసిన తుంటరి పనిగా భావిస్తున్నామని తెలిపారు. ఈ జాబితాలో ప్రథమ స్థానంలో ఉన్న పేరే కాదు, మూడో స్థానంలో ఉన్న పేరు కూడా అనుమానాస్పదంగా ఉంది. కాండిడేట్ నేమ్ అనే కాలమ్ లో ఆంగ్ల అక్షరాలను అర్థంపర్థం లేకుండా పేర్చారు. అయితే లిస్టులో టాప్ లేపిన ఈ 'సన్నీ లియోన్' కు తన ఐడెంటిటీ నిరూపించుకునేందుకు అధికారులు ఫిబ్రవరి 24 వరకు గడువు ఇచ్చారు. ఐడెంటిటీ నిరూపించుకోలేకపోతే రిక్రూట్ మెంట్ నుంచి అనర్హత వేటు వేస్తామని పీహెచ్ఈడీ అధికారులు హెచ్చరించారు.