అలాంటిదేమి లేదంటోన్న బోయపాటి!
- భారీ చిత్రాల దర్శకుడిగా బోయపాటి
- చరణ్ మూవీ ఫ్లాప్ తో విమర్శలు
- నెక్స్ట్ మూవీ బాలకృష్ణతో
అడ్వాన్సులు ఇచ్చిన వాళ్లు తమ ఆలోచనను విరమించుకున్నట్టుగా ఆయనతో చెబుతున్నారని ఫిల్మ్ నగర్ టాక్. ఇదే విషయాన్ని బోయపాటి దగ్గర ఎవరు ప్రస్తావించినా, అలాంటిదేమీ లేదంటూ సింపుల్ గా సమాధానమిస్తున్నట్టుగా సమాచారం. తనపై వస్తోన్న ఇలాంటి విమర్శలన్నీ కూడా, బాలకృష్ణతో హిట్ పడిన తరువాత సర్దుకుంటాయని అంటున్నట్టుగా చెప్పుకుంటున్నారు. ప్రస్తుతం బాలకృష్ణ ప్రాజెక్టు పనిలో వున్న ఆయన, మరోసారి తన సత్తా చాటుకుంటాడేమో చూడాలి.