లేడీ వాయిస్ తో జయరామ్ తో మాట్లాడింది నేను కాదు: సినీ నటుడు సూర్య ప్రసాద్
- రాకేశ్ తో పరిచయం వాస్తవమే
- హత్యతో సంబంధం లేదు
- రాత్రంతా పోలీసుల విచారణలో సూర్యప్రసాద్
అమ్మాయి గొంతుతో జయరామ్ తో తానేమీ మాట్లాడలేదని స్పష్టం చేశాడు. జయరామ్ హత్యకేసుతో తనకు సంబంధం లేదని, అదే విషయాన్ని పోలీసులకు చెప్పానని అన్నాడు. కాగా, జయరామ్ ను తన ఇంటికి పిలిపించేందుకు ఓ అమ్మాయి పేరిట ఆయన్ను ట్రాప్ చేసినట్టు పోలీసులు తేల్చారన్న సంగతి తెలిసిందే. అమ్మాయి గొంతుతో జయరామ్ కు ఫోన్ చేయించిన తరువాతే, ఆమెను కలవాలన్న ఆశతో వచ్చిన జయరామ్ ను నిర్బంధించి హత్య చేశారు.