మహేశ్ బాబు .. అనిల్ రావిపూడి సినిమాకి నిర్మాతగా దిల్ రాజు
- మహేశ్ బాబు 25వ సినిమాగా 'మహర్షి'
- తదుపరి సినిమా అనిల్ రావిపూడితో
- వెనక్కి వెళ్లిన సుకుమార్ ప్రాజెక్ట్
వరుస సినిమాలతో అనిల్ రావిపూడి వరుస విజయాలను అందిస్తూ రావడమే మహేశ్ బాబు దృష్టిలో ఆయనను పడేలా చేసింది. మొదటి నుంచి అనిల్ రావిపూడిపై నమ్మకం ఉంచుతూ వస్తోన్న దిల్ రాజు, 'ఎఫ్ 2'తో భారీ లాభాలను సొంతం చేసుకున్నాడు. ఇప్పుడు మహేశ్ - అనిల్ సినిమాను నిర్మించడానికి ఆయనే ముందుకు వచ్చాడనేది తాజా సమాచారం. గతంలో తన సినిమాల ద్వారా నష్టపోయిన అనిల్ సుంకరను ఆదుకోవడం కోసం, ఈ సినిమా నిర్మాణంలో ఆయనని మహేశ్ బాబు భాగస్వామిని చేసినట్టుగా తెలుస్తోంది.