సురేశ్ బాబుగారిని చూస్తే నాకు ఆ విషయం అర్థమైంది: దర్శకుడు బండి సరోజ్ కుమార్
- సురేశ్ బాబుగారిని కలిసే ఛాన్స్ వచ్చింది
- ఆయనను ఒక రేంజ్ లో ఊహించుకుని టెన్షన్ పడ్డాను
- సింపుల్ గా ఉండటం చూసి షాక్ అయ్యాను
కథ ఎలా చెప్పాలనే విషయంపై బాగా కసరత్తు చేసి వెళ్లాను. తీరా వెళ్లి చూస్తే ఆయన చాలా సింపుల్ గా వున్నారు. ఆ సమయంలో నానక్ రామ్ గూడాలో 'తులసి' సినిమా షూటింగ్ జరుగుతోంది. ఆ సినిమా సెట్లోకి అత్యవసరంగా గడపలు అవసరమయ్యాయి. నన్ను వెంటబెట్టుకుని సురేశ్ బాబుగారు శిల్పకళావేదిక దగ్గరికి వెళ్లి, ఆ గడపలను కారుపై కట్టి అక్కడి నుంచి సెట్ కి తీసుకొచ్చారు. ఆ గడపలను ఆయన స్వయంగా భుజాన వేసుకుని మోయడం చూసి ఆశ్చర్యపోయాను. గొప్ప పారిశ్రామిక వేత్త కావాలంటే .. గొప్పకార్మికుడివి కావాలనే విషయం ఆయనను అలా చూసిన తరువాత అర్థమైంది" అని చెప్పుకొచ్చాడు.