వలచానన్నాడు... ఆపై వంచించి మోసం చేశాడు... నటి ఝాన్సీ ఆత్మహత్యపై తల్లి సంపూర్ణ!
- కుమార్తె పెళ్లి కోసం రూ. 10 లక్షలతో నగలు
- వాటిని కాజేసిన సూర్య తేజ
- పోలీసులకు వాంగ్మూలం ఇచ్చిన ఝాన్సీ తల్లి సంపూర్ణ
రెండు నెలల క్రితం, తనకు కాబోయే భార్యంటూ, ఝాన్సీని బంధువుల ఇంటికి తీసుకెళ్లాడని, అక్కడ ఏం జరిగిందో తెలియదుగానీ, అప్పటి నుంచి వేధింపులు మొదలయ్యాయని ఆరోపించారు. అప్పటికీ, అతనే కావాలని భావించిన తన కుమార్తె, షూటింగులకు వెళ్లడాన్ని మానివేసి, సూర్యతేజతోనే కలిసుండాలని, జీవితం పంచుకోవాలని భావించిందని అన్నారు. చివరకు ఇతర వ్యక్తులతో అక్రమ సంబంధాన్ని అంటగడితే తట్టుకోలేక, మానసికంగా కుంగిపోయి ఆత్మహత్యకు పాల్పడిందని ఆరోపించారు. వెంటనే సూర్యతేజను అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని, ఝాన్సీ ఆత్మకు శాంతి కలిగేలా చేయాలని వారు డిమాండ్ చేశారు.