వికారాబాద్ కలెక్టర్ పై ఎన్నికల సంఘం గుస్సా.. సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు!
- ఈవీఎంల పనితీరుపై హైకోర్టుకు కాంగ్రెస్ నేతలు
- అంతలోనే 100కుపైగా ఈవీఎంలకు సీల్ తీసిన కలెక్టర్
- నిబంధనలు ఉల్లంఘించడంతో సస్పెన్షన్ వేటు
కేసు కోర్టులో ఉండగానే బెంగళూరు నుంచి వచ్చిన బెల్ ఇంజనీర్లు ఆ నియోజకవర్గాలకు చెందిన 100కు పైగా ఈవీఎంలను కలెక్టర్ సమక్షంలో తనిఖీ చేయడంతో వివాదం ముదిరింది. కేసు కోర్టులో ఉండగానే ఈవీఎం సీల్స్ తీయడంపై కాంగ్రెస్ నేతలు ఈసీకి ఫిర్యాదు చేశారు. దీంతో ఆయనపై వేటు వేస్తూ ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది. అయితే లోక్ సభ ఎన్నికలకు ఈవీఎంలను సిద్ధం చేయడంలో భాగంగానే తనిఖీలు నిర్వహించామని అధికారులు చెబుతున్నారు.