బాలకృష్ణగారు నాకు వార్నింగ్ ఇచ్చారనడంలో నిజం లేదు: హైపర్ ఆది
- 'జబర్దస్త్'తో పాప్యులర్
- అలాంటి స్కిట్ ఏదీ నేను చేయలేదు
- రామారావుగారి ఫాన్స్ నుంచి ఫోన్ వచ్చింది
ఈ విషయంపై తాజా ఇంటర్వ్యూలో హైపర్ ఆది స్పందించాడు. బాలకృష్ణ గారు నన్ను మందలించారనే వార్తలో ఎంతమాత్రం నిజంలేదు. ఆయనకి అసహనాన్ని కలిగించే స్కిట్ ఏదీ నేను చేయలేదు. 'అదిరే అభి' టీమ్ లో ఆ మధ్య ఒకరు ఎన్టీఆర్ గెటప్ వేశారు. ఆ విషయంలో ఎన్టీ రామారావుగారి అభిమానుల నుంచి ఎవరో ఫోన్ చేసి చిన్న వార్నింగ్ ఇచ్చారు. ఆ విషయాన్ని ఒక చోట నేను ప్రస్తావించడం వలన, అది నాకు ఆపాదించబడింది ..అంతే" అని చెప్పుకొచ్చాడు.