ఆత్మహత్యకు ముందు ప్రియుడు సూర్యతో పదేపదే ఫోన్లో మాట్లాడిన టీవీ నటి ఝాన్సీ
- ఆత్మహత్యకు ముందు మూడుసార్లు ఫోన్ సంభాషణ
- కాల్ డేటాను సేకరించిన పోలీసులు
- సూర్యతేజ-ఝాన్సీ మధ్య ప్రేమ ఉన్నట్టు పోలీసుల నిర్ధారణ
ఈ సంభాషణ ఆధారంగా వారిద్దరి మధ్య ప్రేమ కొనసాగినట్టు పోలీసులు అభిప్రాయపడుతున్నారు. ఆమె వాడిన ఫోన్లలో శాంసంగ్ ఫోన్ లాక్ తెరిచిన పోలీసులు, ఐఫోన్‌ను అన్‌లాక్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. కాగా, శాంసంగ్ ఫోన్లో ఆమె ఆత్మహత్యకు ముందు తీసుకున్నట్టుగా చెబుతున్న వీడియో లేదని తెలుస్తోంది. ఐఫోన్‌ను అన్‌లాక్ చేస్తే ఏమైనా సమాచారం లభిస్తుందేమోనని భావిస్తున్నారు.
మరోవైపు, అంత్యక్రియల కోసం స్వగ్రామానికి వెళ్లిన ఝాన్సీ కుటుంబ సభ్యులను విచారణ కోసం నగరానికి రావాలని పోలీసులు కోరినట్టు తెలుస్తోంది. వారిచ్చే సమాచారం ఆధారంగా సూర్య తేజను విచారించాలని పోలీసులు ఓ నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం.