నాడు చిన్న మార్పుతో ప్రజల మనసులను వైఎస్ రాజశేఖరరెడ్డి చూరగొన్నారు.. ఎవరినీ తీసిపారేయద్దు: ‘లోక్ సత్తా’ వ్యవస్థాపకుడు జేపీ
- అందరికీ, అన్నీ అందాలని వైఎస్ కీలక అంశంగా పెట్టుకున్నారు
- ఆ దెబ్బతో ప్రజల మనసుల్లో నిలిచిపోయారు
- ఏ నాయకుడిని తక్కువ అంచనా వేయొద్దు
ఏ నాయకుడినీ తక్కువ అంచనా వేయొద్దని, ఆ సందర్భాన్ని లేదా వారి వ్యక్తిత్వాన్ని అనుసరించో ప్రతి నాయకుడికి వారి పరిమితులు వారికి ఉంటాయని, అది నరేంద్ర మోదీ, రాహుల్ గాంధీ , కేసీఆర్, చంద్రబాబు లేదా జగన్ కావచ్చు ఎవరినీ తక్కువ అంచనా వేయొద్దని అన్నారు. నాయకుల గురించి తేలికగా మాట్లాడటం, వారిపై కటువైన భాష మాట్లాడటం, తీసి పారేయడం ఈ దేశంలో అలవాటైపోయిందని అభిప్రాయపడ్డారు.