'తెనాలి రామకృష్ణ .. బీఏబీఎల్' షూటింగ్ మొదలు
- నాగేశ్వరరెడ్డి నుంచి మరో కామెడీ మూవీ
- సందీప్ కిషన్ జోడీగా హన్సిక
- కర్నూల్ లో షూటింగ్
ఈ సినిమాలో కథానాయకుడిగా సందీప్ కిషన్ ను .. కథానాయికగా హన్సికను ఎంపిక చేసుకున్నాడు. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఈ రోజునే మొదలైంది. మొదటి షెడ్యూల్ ను 'కర్నూల్'లో ప్లాన్ చేశారు. కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను అక్కడ చిత్రీకరిస్తున్నారు. కొన్ని రోజుల పాటు అక్కడే షూటింగు జరగనుంది. కొంతకాలంగా వరుస పరాజయాలను ఎదుర్కొంటున్న సందీప్ కిషన్, ఈ సినిమాపైనే ఆశలు పెట్టుకున్నాడు. ఇక హీరోయిన్ గా 'గౌతమ్ నంద' తరువాత హన్సిక చేస్తోన్న సినిమా ఇదే.