పుర్రె చిట్లిపోయింది... మధులిక పరిస్థితి అత్యంత విషమమన్న డాక్టర్లు!
- ప్రేమోన్మాది ఘాతుకానికి బలైన మధులిక
- 48 గంటలు గడిస్తేనే ఏమైనా చెప్పగలం
- ప్రస్తుతం వెంటిలేటర్ పై మధులిక ఉందన్న వైద్యులు
ఆమె శరీరంపై 14 చోట్ల కత్తిగాట్లు ఉన్నాయని, తల పైభాగంలో పుర్రె రెండుగా చీలి, నరాలు తెగిపోయాయని, అంతర్గత రక్తస్రావం అధికంగా ఉందని అన్నారు. దవడ వద్ద, మణికట్టులపై, అరచేతులపై బలమైన గాయాలు ఉన్నాయని, చేతి వేళ్ల కీళ్లు విరిగి బయటకు వచ్చాయని అన్నారు. ఇప్పటివరకూ ఆమెకు 5 బాటిళ్ల రక్తం ఎక్కించామని, తెగి వేలాడుతున్న శరీర భాగాలకు కుట్లు వేశామని తెలిపారు.
ఆమెను ఆసుపత్రికి తీసుకు వచ్చే సరికే పల్స్, బీపీ పడిపోయాయని, వెంటిలేటర్ సాయంతో కృత్రిమ శ్వాసను అందిస్తున్నామని వెల్లడించారు. రక్తస్రావం ఆగి, రక్తపోటు సాధారణ స్థాయికి వచ్చిన తరువాత ఆమెకు శస్త్రచికిత్స చేయాల్సివుందని చెప్పారు.