బుల్లితెర నటి ఝాన్సీ ఆత్మహత్య కేసు: పోలీసుల అదుపులో ప్రియుడు సూర్య!
- సూర్యతో చాటింగ్ చేసిన తరువాతే ఆత్మహత్య
- ఝాన్సీ సెల్ ఫోన్ స్వాధీనం
- లాక్ ఓపెన్ చేయించేందుకు సైబర్ నిపుణుల సాయం
ఘటనా స్థలిలో ఝాన్సీ సెల్ ఫోన్ ను స్వాధీనం చేసుకున్న పోలీసులు, దాని లాక్ ను ఓపెన్ చేసేందుకు సైబర్ క్రైమ్ నిపుణుల సహాయం కోరారు. ఝాన్సీ స్వస్థలం కృష్ణా జిల్లా గుడివాడ సమీపంలోని ముద్దెనెపల్లి మండలం వాడాలి కాగా, ఆమె కుటుంబీకులకు సమాచారం అందించామని, వారు వచ్చిన తరువాత మరిన్ని విషయాలు వెలుగులోకి వస్తాయని భావిస్తున్నామని తెలిపారు.