నేను నవ్వుతూ ఉండటానికి కారణం నా భర్తే!: జెనీలియా
- నేను అలాంటి కలలేవీ కనలేదు
- బాధలో ఉన్నప్పుడు ఓదారుస్తాడు
- ఎప్పుడూ ఇలాగే కలిసి ఉందాం
‘ప్రతి ఆడపిల్లకు తన జీవిత భాగస్వామి ఇలా ఉండాలి, అలా ఉండాలని కొన్ని అభిప్రాయాలుంటాయి. కానీ నేను అలాంటి కలలేవీ కనలేదు. నిజాయతీగా చెప్పాలంటే నాకు అద్భుతమైన లైఫ్ పార్ట్‌నర్ దొరికాడు. నేను బాధలో ఉన్నప్పుడు ఓదారుస్తాడు. జీవితం ఎంత కఠినంగా ఉన్నా ఇద్దరం కలిసే ప్రయాణించగలం అన్న భరోసా కల్పించాడు. నేను నవ్వుతూ ఉండటానికి కారణం అతనే. అందుకే నాకు కాబోయే భర్త ఇలా ఉండాలంటూ ఎప్పుడూ కలలు కనలేదు. ఎలాంటి అభిప్రాయాలను పెట్టుకోలేదు. ఐ లవ్యూ రితేశ్. ఇద్దరం కలిసి ఎప్పుడూ ఇలాగే సంతోషంగా ఉందాం. సుఖదుఖాలను పంచుకుందాం’ అంటూ తన భర్తతో కలిసి దిగిన ఫొటోను జెనీలియా ఇన్‌స్టాగ్రాంలో షేర్ చేసింది.