నీలిరంగులోకి మారిన జయరామ్ మృతదేహం... విషమిచ్చి చంపినట్టు అనుమానం!
- సొంత కారులో విగతజీవిగా కనిపించిన చిగురుపాటి జయరామ్
- రంగు మారిన మృతదేహాన్ని చూసిన పోలీసులకు కొత్త అనుమానం
- ప్రస్తుతం బసవతారకం ఆసుపత్రి మార్చురీలో మృతదేహం
కాగా, కృష్ణాజిల్లా, నందిగామ సమీపంలోని ఐతవరం సమీపంలో జాతీయ రహదారి పక్కన నిన్న తెల్లవారుజామున జయరామ్ మృత దేహం కనిపించిన సంగతి తెలిసిందే. ఈ కేసులో జయరామ్ మేనకోడలు, ఆయన నడిపిన టీవీ చానల్ ఎండీ శిఖా చౌదరిని నిందితురాలిగా భావిస్తున్న పోలీసులు, ప్రస్తుతం ఆమెను రహస్య ప్రాంతంలో విచారిస్తున్నారు. రెండేళ్ల క్రితం జయరామ్ తల్లి మరణించగా, నాటి నుంచి ఆస్తి గొడవలు జరుగుతున్నట్టు తెలుస్తోంది.