బోయపాటి మూవీలో ముఖ్యమంత్రిగా బాలయ్య?
- బాలకృష్ణ నెక్స్ట్ మూవీ బోయపాటితో
- గతంలో ఇద్దరి కాంబినేషన్లో రెండు హిట్లు
- ఈ నెలలోనే మూడో సినిమా లాంచ్
గతంలో బాలకృష్ణ .. బోయపాటి కాంబినేషన్లో 'సింహా' .. 'లెజెండ్' సినిమాలు వచ్చాయి. ఈ రెండు సినిమాలు ఘన విజయాలను సొంతం చేసుకున్నాయి. ఈ రెండు సినిమాల్లోను బాలకృష్ణ ద్విపాత్రాభినయం చేయడం విశేషం. ఇప్పుడు బోయపాటి చేయనున్న సినిమాలోను బాలకృష్ణ ద్విపాత్రాభినయం చేయనున్నట్టుగా తెలుస్తోంది. ఒక పాత్రలో ఆయన ముఖ్యమంత్రిగా కనిపించనున్నారని చెప్పుకుంటున్నారు. ఈ నెలలోనే ఈ సినిమా పూజా కార్యక్రమాలను జరుపుకోనుంది. ఇక ప్రతినాయకుడు ఎవరు? కథానాయికలు ఎవరు? అనే విషయాలతో పాటు మిగతా వివరాలు త్వరలోనే తెలియనున్నాయి.