'96' సినిమాపై అసలు విషయం తెలియకనే సమంత అలా మాట్లాడింది: దిల్ రాజు
- '96'ను రీమేక్ చేయకపోవడమే మంచిదన్న సమంత
- ఇప్పుడు రీమేక్ లో నటించే చాన్స్ కొట్టేసిన సమంత
- స్పందించిన నిర్మాత దిల్ రాజు
ఇక సమంత గతంలో చేసిన కామెంట్లపై స్పందించిన దిల్ రాజు, ఈ సినిమా రీమేక్ హక్కులను ఎవరు కొనుగోలు చేశారో, ఎవరు నటించనున్నారో తెలియక సమంత అప్పట్లో ఆ కామెంట్ చేసుంటారని అన్నాడు. అసలు విషయాన్ని ఆమె ఊహించివుంటే ఈ వ్యాఖ్యలు వచ్చుండేవి కాదన్నాడు. కాగా, తమిళవర్షన్ కు దర్శకత్వం వహించిన ప్రేమ్ కుమార్ తెలుగు వర్షన్ ను కూడా డైరెక్ట్ చేయనుండగా, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్‌రాజు నిర్మిస్తున్నారు.