నన్ను కామెంట్ చేసినవారికి తగిన సమాధానం చెప్పాను: నిధి అగర్వాల్
- 'సవ్యసాచి' పరాజయం పాలైంది
- ఏడుస్తూ కూర్చోవడం నాకు నచ్చదు
- నా పాత్రకి మంచి పేరు వచ్చింది
'సవ్యసాచి' విడుదలైన సమయంలోనే 'చూడటానికి అందంగానే ఉంటుందిగానీ .. నటన అంతంత మాత్రమే' అంటూ కొంతమంది నన్ను కామెంట్ చేశారు. నా నటనతోనే వాళ్లకి సమాధానం చెప్పాలని అప్పుడే నిర్ణయించుకున్నాను. అదృష్టం కొద్దీ 'మిస్టర్ మజ్ను'లో నటనకి అవకాశం వున్న పాత్ర లభించింది .. నా నటనకి మంచి పేరు వచ్చింది. నన్ను విమర్శించిన వాళ్లకి సరైన సమాధానం ఇచ్చాననే అనుకుంటున్నాను" అని చెప్పుకొచ్చింది.