'యాత్ర' ప్రీ రిలీజ్ ఈవెంట్ కి సన్నాహాలు
- 'యాత్ర' బయోపిక్ పై భారీ అంచనాలు
- వచ్చేనెల 8వ తేదీన విడుదల
- రేపు సాయంత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్
ఈ నేపథ్యంలో ఈ సినిమా టీమ్ రేపు ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఏర్పాటు చేసింది. హైదరాబాద్ .. మాదాపూర్ లోని ఎన్ కన్వెన్షన్ లో సాయంత్రం 6 గంటల నుంచి ఈ వేడుక మొదలు కానుంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ తాజాగా ఓ పోస్టర్ ను వదిలారు. వైఎస్ పాత్రలో ఈ సినిమాకి మమ్ముట్టి ప్రధాన బలంగా నిలవడంతో భారీగా అంచనాలు వున్నాయి. ఆ అంచనాలను ఈ సినిమా ఎంతవరకూ అందుకుంటుందో చూడాలి మరి.