విజయ్ దేవరకొండ సినిమాలో పాత్ర గురించి అనసూయ
- నిర్మాతగా విజయ్ దేవరకొండ
- ప్రధానపాత్రల్లో తరుణ్ భాస్కర్ .. అనసూయ
- హీరో హీరోయిన్లు అంటూ ప్రచారం
దాంతో తరుణ్ భాస్కర్ .. అనసూయ హీరోహీరోయిన్లు అంటూ ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఈ విషయంపై తాజాగా అనసూయ స్పందించింది. "ఈ సినిమాలో నేను చేసేది రొమాంటిక్ పాత్ర కాదు .. వేరే పాత్రలతో రొమాన్స్ కూడా ఉండదు. ఇది చాలా కీలకమైన పాత్ర అని మాత్రం చెప్పగలను. నా కెరియర్ కి ఈ పాత్ర చాలా హెల్ప్ అవుతుందనే నమ్మకం వుంది. మిగతా వివరాలు ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లాక చెబుతాను" అని అంది. అనసూయ ఇలా చెప్పిన తరువాత ఈ సినిమాపై మరింత ఆసక్తి పెరగడం ఖాయమనిపిస్తోంది.