వరుస ఫ్లాపులతో వున్న రాజ్ తరుణ్ మంచి ఛాన్స్ కొట్టేశాడు
- ఈ మధ్య కాలంలో హిట్ లేని రాజ్ తరుణ్
- దిల్ రాజు బ్యానర్లో అవకాశం
- త్వరలోనే సెట్స్ పైకి
గతంలో ఈ దర్శకుడి నుంచి 'ఆడు మగాడ్రా బుజ్జీ' సినిమా వచ్చింది. ఇప్పుడు దిల్ రాజు నిర్మాతగా ఈ దర్శకుడు రూపొందించనున్న సినిమాలో రాజ్ తరుణ్ ని కథానాయకుడిగా తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ఇంతకుముందు ఈ దర్శకుడితో గల్లా జయదేవ్ తనయుడు హీరోగా ఒక సినిమా చేయాలని దిల్ రాజు అనుకున్నారు. ఇటీవలే ఆయన ఆ ఆలోచనను విరమించుకున్నట్టుగా వార్తలు వచ్చాయి. అదే కథను ఇప్పుడు రాజ్ తరుణ్ హీరోగా చేస్తున్నట్టుగా ఫిల్మ్ నగర్లో ఒక వార్త షికారు చేస్తోంది.