ముద్రగడ ‘చలో కత్తిపూడి’ సభకు అనుమతి లేదన్న పోలీసులు.. తూర్పు గోదావరిలో టెన్షన్ టెన్షన్!
- ఈ నెల 31న ‘చలో కత్తిపూడి’ సభకు ముద్రగడ పిలుపు
- అనుమతి కోరితే పరిశీలిస్తామన్న ఎస్పీ
- కిర్లంపూడిలో పోలీసుల బందోబస్తు
ఈ నెల 31న ముద్రగడ చేపట్టనున్న ‘చలో కత్తిపూడి’ సభకు ఆయన ఎటువంటి అనుమతులు తీసుకోలేదని, ఒకవేళ కోరితే పరిశీలిస్తామని ఎస్పీ తెలిపారు. సోమవారం కిర్లంపూడిలో ఆకస్మికంగా పర్యటించిన ఆయన పరిస్థితిని సమీక్షించారు. ఇటీవల వైఎస్ జగన్, పవన్ కల్యాణ్ నిర్వహించిన సభలకు పోలీసుల అనుమతులు ఉన్నాయని ఎస్పీ పేర్కొన్నారు.