విజయ్ దేవరకొండ పారితోషికం 10 కోట్లు?
- స్టార్ హీరోల జాబితాలో విజయ్ దేవరకొండ
- యూత్ లో విపరీతమైన క్రేజ్
- దిల్ రాజు సంప్రదించినట్టుగా టాక్
ఈ నేపథ్యంలో ఆయనతో సినిమా చేయడానికి దిల్ రాజు ప్రయత్నాలు మొదలెట్టినట్టుగా కొన్ని రోజులుగా వార్తలు షికారు చేస్తున్నాయి. విజయ్ దేవరకొండను దిల్ రాజు సంప్రదించగా, ఆయన తన పారితోషికం 10 కోట్లు అని చెప్పాడనేది తాజా సమాచారం. దాంతో దిల్ రాజు ఆలోచనలో పడ్డాడని చెప్పుకుంటున్నారు. ఇది వాస్తవమే అయితే, విజయ్ దేవరకొండ ఆ స్థాయి పారితోషికాన్ని డిమాండ్ చేయడం సబబేననే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.