మళ్లీ రంగంలోకి దిగుతోన్న నారా రోహిత్
- హిట్స్ కి దూరమైన నారా రోహిత్
- తదుపరి సినిమా చైతన్య దంతులూరితో
- వచ్చేనెల చివర్లో సెట్స్ పైకి
తొలి చిత్రమైన 'బాణం'తో మంచి పేరు తెచ్చుకున్న ఆయన, తాజాగా నారా రోహిత్ కోసం ఒక విభిన్నమైన కథను సిద్ధం చేశాడు. ఇంతవరకూ చేయని పాత్ర కావడంతో, నారా రోహిత్ ఈ సినిమాను చేయడానికి ఉత్సాహాన్ని చూపించాడు. ఇప్పటికే స్క్రిప్ట్ లాక్ చేసేశారు .. ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తికావొచ్చాయి. వచ్చేనెల చివర్లో సెట్స్ పైకి వెళ్లనున్నారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయి. త్వరలోనే ఈ ప్రాజెక్టుకు సంబంధించిన మిగతా వివరాలు తెలియనున్నాయి. మరోసారి ఈ ఇద్దరూ కలిసి హిట్ కొడతారేమో చూడాలి.