పారితోషికం తగ్గించుకున్న రవితేజ?
- వరుస పరాజయాలతో రవితేజ
- రేపు రవితేజ పుట్టినరోజు
- వీఐ ఆనంద్ సినిమా నుంచి ఫస్టులుక్
రీసెంట్ గా వీఐ ఆనంద్ దర్శకత్వంలో రామ్ తాళ్లూరి నిర్మించనున్న సినిమా విషయంలోను ఇదే పరిస్థితి తలెత్తినట్టుగా చెప్పుకున్నారు. రవితేజ హీరోగా ఆ మధ్య వచ్చిన 'టచ్ చేసి చూడు'.. 'నేల టికెట్' .. 'అమర్ అక్బర్ ఆంటోని' సినిమాలు వరుస పరాజయాలను అందుకున్నాయి. ఈ ప్రభావం రవితేజ తదుపరి సినిమాపై ఉంటుంది కనుక, పారితోషికం తగ్గించుకోమన్నారట. మొదట ససేమిరా అన్న రవితేజ .. ఆ తరువాత అందుకు అంగీరించాడని టాక్. ఇక రవితేజ పుట్టినరోజు సందర్భంగా రేపు ఈ సినిమా నుంచి టైటిల్ తో కూడిన ఫస్టులుక్ రానుందని తెలుస్తోంది.