31 సినిమాలు తీశాను .. ఏడు సినిమాలు మాత్రమే సంతృప్తినిచ్చాయి: నిర్మాత దిల్ రాజు
- అభిరుచిగల నిర్మాతగా దిల్ రాజు
- 'ఎఫ్ 2'తో తాజాగా లభించిన హిట్
- మొదటిస్థానం 'బొమ్మరిల్లు'దే
అలాంటి దిల్ రాజు తాజాగా 'ఎఫ్ 2' సినిమాతో మరో హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ సందర్భంగా తాజా ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ .. "నా కెరియర్లో ఇంతవరకూ నేను 31 సినిమాలను నిర్మించాను. వాటిలో ఏడు సినిమాలు మాత్రమే నాకు చాలా సంతృప్తిని ఇచ్చాయి. అలా ఓ నిర్మాతగా నాకు సంతృప్తిని ఇచ్చిన సినిమాల జాబితాలో 'ఆర్య' .. 'బొమ్మరిల్లు' .. 'కొత్త బంగారులోకం' .. 'మిస్టర్ పెర్ఫెక్ట్'.. 'బృందావనం'.. 'శతమానం భవతి'.. 'ఎఫ్ 2' కనిపిస్తాయి. ఈ ఏడు సినిమాల్లో మొదటి స్థానం దేనికి ఇస్తారంటే మాత్రం 'బొమ్మరిల్లు' పేరే చెబుతాను. ఎందుకంటే ఈ సినిమా అన్ని కుటుంబాల వారిని కదిలించివేసింది" అని చెప్పుకొచ్చారు.