రాజమౌళి సినిమాలో ప్రముఖ దర్శకుడు!
- షూటింగు దశలో 'ఆర్ ఆర్ ఆర్'
- ముఖ్యమైన పాత్రలో సముద్రఖని
- దర్శకుడిగా .. నటుడిగా మంచి ఇమేజ్
ఈ వార్త నిజమేననేది తాజాగా అందుతోన్న సమాచారం. చాలా ప్రాధాన్యత కలిగిన ఒక ముఖ్యమైన పాత్ర కోసం ఆయనను తీసుకున్నారట. ఆ పాత్ర ఏమిటనే విషయమే తెలియాల్సి వుంది. సముద్రఖనికి అభిరుచి కలిగిన దర్శకుడిగా .. సహజ నటుడిగా తమిళనాట మంచి పేరు వుంది. 'రఘువరన్ బీటెక్'లో ధనుశ్ తండ్రి పాత్ర ద్వారా ఆయన తెలుగు ప్రేక్షకులకు చేరువయ్యాడు. కీరవాణి సంగీతాన్ని సమకూర్చుతోన్న ఈ సినిమాను, తెలుగు .. తమిళ .. మలయాళ .. హిందీ భాషల్లో విడుదల చేయనున్నారు.