సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం
- హ్యాక్ అయిన హన్సిక మొబైల్
- మార్చి నెలలో 'లక్ష్మీస్ ఎన్టీఆర్'
- అల్లు అర్జున్ సినిమా అప్ డేట్
- ఏభై దేశాల్లో 'మణికర్ణిక' విడుదల
* రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో రూపొందుతున్న 'లక్ష్మీస్ ఎన్టీఆర్' చిత్రాన్ని మార్చ్ నెలలో విడుదల చేయనున్నారు. ఈ విషయాన్ని చిత్ర నిర్మాత రాకేశ్ రెడ్డి తెలిపారు. వచ్చే నెల మొదటి వారంలో చిత్రం టీజర్ ను రిలీజ్ చేస్తామని చెప్పారు.
* అల్లు అర్జున్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో రూపొందే చిత్రం కోసం కథానాయికను ఎంపిక చేసే పనిలో చిత్ర బృందం బిజీగా వుంది. కాగా, ఈ చిత్రం ఎమోషనల్ లవ్ స్టోరీగా రూపొందుతుందట.
* బాలీవుడ్ భామ కంగనా రనౌత్ ప్రధాన పాత్ర పోషించిన 'మణికర్ణిక' చిత్రాన్ని రేపు గ్రాండ్ రిలీజ్ చేస్తున్నారు. హిందీ, తెలుగు, తమిళం సహా వివిధ భాషల్లో ఏభై దేశాల్లో దీనిని విడుదల చేస్తున్నారు.