'ఎఫ్ 3'కి సన్నాహాలు .. వెంకీ - వరుణ్ లకు తోడుగా రవితేజ
- సూపర్ హిట్ కేటగిరీలోకి చేరిన 'ఎఫ్ 2'
- 'ఎఫ్ 3' ఉంటుందని చెప్పిన అనిల్ రావిపూడి
- ఈ సీక్వెల్లో అంధుడిగా రవితేజ?
ఇప్పుడు ఈ విషయాన్ని గురించిన వార్తే ఫిల్మ్ నగర్లో షికారు చేస్తోంది. వెంకటేశ్ .. వరుణ్ తేజ్ లతోనే 'ఎఫ్ 2' కి సీక్వెల్ గా 'ఎఫ్ 3' రానుందని అంటున్నారు. అయితే కొత్త మార్పు ఏంటంటే ఈ ఇద్దరికీ రవితేజ తోడు కానున్నాడని అంటున్నారు. 'రాజా ది గ్రేట్' తరహాలోనే ఈ సినిమాలో రవితేజ అంధుడిగా కనిపిస్తాడని చెబుతున్నారు. ఈ పాత్ర నుంచి కూడా నాన్ స్టాప్ నవ్వులు పూయించడానికి అనిల్ రావిపూడి రెడీ అవుతున్నాడని చెప్పుకుంటున్నారు. త్వరలోనే ఈ విషయంపై స్పష్టత రానుంది.