లోకేశ్ చిన్న పిల్లాడు.. టీడీపీ గురించి చాలా నిజాయతీగా చెప్పాడు!: నాగబాబు సెటైర్
- గతంలో లోకేశ్ వ్యాఖ్యల ప్రస్తావన
- నిజాలు చెప్పినందుకు థ్యాంక్స్
- కొత్త ఛానల్ పేరు ప్రకటించిన నాగబాబు
గతంలో టీడీపీ నిర్వహించిన ఓ సభలో ‘ఎలాంటి బంధుప్రీతి, మతపిచ్చి, కులపిచ్చి ఉన్న పార్టీ ఈ రాష్ట్రంలో ఏదన్నా ఉందంటే అది టీడీపీనే’ అంటూ లోకేశ్ పొరపాటున చేసిన వ్యాఖ్యలను నాగబాబు ఈ వీడియోలో ప్రస్తావించారు. ‘ఇంత నిజాయతీగా ముందుకు వచ్చి మీ పార్టీ గురించి నిజాలు చెప్పినందుకు థ్యాంక్యూ లోకేశ్ గారూ’ అని చెప్పారు. ఇంత నిజాయతీగా ఉండటం దేశంలోని ఏ రాజకీయ నాయకుడికీ సాధ్యం కాదని కితాబిచ్చారు. ఈ వీడియోను మీరూ చూసేయండి.