డిఫరెంట్ లుక్ తో షాక్ ఇస్తోన్న మాధవన్!
- నంబి నారాయణ్ పాత్రలో మాధవన్
- కీలకమైన పాత్రలో సిమ్రాన్
- వివిధ భాషల్లో విడుదల
ఆ పాత్రను ఆయన ఎంత అంకితభావంతో చేస్తున్నాడనేది అందుకు సంబంధించిన ఫోటోలు చూస్తే తెలిసిపోతుంది. ఆ ఫోటోలు చూస్తే ఎవరు అసలు నంబి నారాయణ్ అనేది పోల్చుకోవడం కష్టం అనేంతగా మాధవన్ శ్రద్ధ పెట్టాడు. ఇప్పటికే ఈ సినిమా చాలావరకూ చిత్రీకరణను జరుపుకుంది. ఈ సినిమా కోసం దర్శకుడిగా రంగంలోకి దిగిన అనంత్ మహదేవన్ కొన్ని కారణాల వలన పక్కకి తప్పుకోవడంతో, దర్శకత్వ బాధ్యతలను మాధవన్ తన భుజాలపై వేసుకున్నాడు. వివిధ భాషల్లో ఈ సినిమాను విడుదల చేయనున్నారు.