సరిహద్దుల్లో యాక్షన్ కి దిగిపోయిన గోపీచంద్
- స్పై థ్రిల్లర్ నేపథ్యంలో గోపీచంద్
- యాక్షన్ ఎపిసోడ్ తో మొదలెట్టిన తిరు
- మే నెలలో విడుదల చేసే ఆలోచన
ఫ్యామిలీ ఎంటర్టైనర్లు చేసినా .. గోపీచంద్ కి యాక్షన్ హీరోగానే మంచి క్రేజ్ వుంది. ఇంతవరకూ ఆయన చేసిన యాక్షన్ ఎపిసోడ్స్ కి పూర్తి భిన్నంగా ఈ సినిమాలోని యాక్షన్ సీన్ ఉంటుందని అంటున్నారు. ఈ యాక్షన్ ఎపిసోడ్ ఈ సినిమా హైలైట్స్ లో ఒకటిగా నిలిచిపోతుందని చెబుతున్నారు. అనిల్ సుంకర నిర్మిస్తోన్న ఈ సినిమాను మే నెలలో విడుదల చేయాలనే ఆలోచనలో వున్నారు. కొంతకాలంగా హిట్ కోసం వెయిట్ చేస్తోన్న గోపీచంద్ కి, ఈ సినిమాతోనైనా హిట్ దొరుకుతుందేమో చూడాలి