'ఆర్ ఎక్స్ 100' హీరో జోడీగా మలయాళ బ్యూటీ
- అర్జున్ జంధ్యాల దర్శకత్వంలో కార్తికేయ
- ఒంగోలులో జరుగుతోన్న షూటింగ్
- కథానాయికగా అనఘ మరుతోర
రీసెంట్ గా ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఒంగోలులో మొదలైంది. ఈ సినిమాలో కథానాయిక ఎవరనే ఆసక్తి యూత్ లో కలిగింది. కథానాయిక పాత్ర కోసం మలయాళ ముద్దుగుమ్మ 'అనఘ మరుతోర'ను ఎంపిక చేశారనేది తాజా సమాచారం. క్రితం ఏడాది తమిళంలో ఎంట్రీ ఇచ్చిన ఈ సుందరి, ఈ సినిమాతో తెలుగు తెరకి పరిచయమవుతోంది. ఈ అమ్మాయి మంచి డాన్సర్ అని తెలుస్తోంది. పాయల్ రాజ్ పుత్ మాదిరిగానే ఈ అమ్మాయి కూడా మంచి మార్కులు కొట్టేస్తుందేమో చూడాలి.