బాలకృష్ణతో కలిసి బోయపాటి సెట్స్ పైకి వెళ్లేది అప్పుడే
- బాలకృష్ణ తదుపరి సినిమా బోయపాటితో
- ఏప్రిల్లో సెట్స్ పైకి వెళ్లే దిశగా పనులు
- గతంలో ఇద్దరి కాంబినేషన్లో రెండు హిట్లు
ఫిబ్రవరిలో ఈ సినిమాను లాంచ్ చేయవచ్చనే టాక్ వినిపించింది. కానీ ఏప్రిల్లో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుందనేది తాజా సమాచారం. ఈ లోగా బోయపాటి స్క్రిప్ట్ ను పక్కాగా సిద్ధం చేసుకుని .. మిగతా పనులు కూడా పూర్తి చేసేస్తాడట. ఈ సంక్రాంతికి 'కథానాయకుడు'తో బాలకృష్ణ .. 'వినయ విధేయ రామ'తో బోయపాటి బరిలోకి దిగినా పెద్దగా ఫలితం పొందలేదు. మరిప్పుడు ఇద్దరూ కలిసి హిట్ కొడతారేమో చూడాలి.