'యాత్ర'లో ఎమ్మెల్యే గా కనిపించనున్న అనసూయ
- మమ్ముట్టి ప్రధాన పాత్రలో 'యాత్ర'
- రాజా రెడ్డి పాత్రలో జగపతిబాబు
- ఫిబ్రవరి 8వ తేదీన విడుదల
ఎమ్మెల్యే 'గౌరు చరితా రెడ్డి' పాత్రలో అనసూయ కనిపించనుందని అంటున్నారు. 2004లో కాంగ్రెస్ పార్టీ తరఫున నందికొట్కూరు నియోజక వర్గం నుంచి పోటీ చేసి చరితా రెడ్డి ఏ విధంగా గెలిచారు? .. అప్పటి పరిస్థితులను ఆమె ఎలా ఎదుర్కొన్నారు? కాంగ్రెస్ పార్టీ కోసం ఆమె చేసిన కృషి .. మొదలైన విషయాలను ఈ సినిమాలో చూపించనున్నారట. వైఎస్ పాత్రలో మమ్ముట్టి .. ఆయన తండ్రి రాజారెడ్డి పాత్రలో జగపతిబాబు నటించిన ఈ సినిమాను, ఫిబ్రవరి 8వ తేదీన విడుదల చేయనున్నారు.