హిందీ రీమేక్ దిశగా 'గీత గోవిందం'
- 'ధడక్'తో హిట్ కొట్టిన ఇషాన్ కట్టర్
- 'గీత గోవిందం' రీమేక్ లో చేసే ఛాన్స్
- త్వరలో పూర్తి వివరాలు
తెలుగులో విజయ్ దేవరకొండ చేసిన పాత్రను ఇషాన్ కట్టర్ చేయనున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ తో కలిసి ఇషాన్ కట్టర్ చేసిన 'ధడక్' భారీ విజయాన్ని సాధించింది. ఆ తరువాత ఆయన చేసే సినిమా ఇదే కానుందని అంటున్నారు. త్వరలోనే ఈ ప్రాజెక్టుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియనున్నాయి. ఇక విజయ్ దేవరకొండ చేసిన 'అర్జున్ రెడ్డి' .. ఆల్రెడీ హిందీలో 'కబీర్ సింగ్' పేరుతో రూపొందుతోన్న సంగతి తెలిసిందే.