మహేశ్ బాబు మేనల్లుడితో దిల్ రాజు సినిమా రద్దు?
- గల్లా అశోక్ తో చేయాలనుకున్న దిల్ రాజు
- స్క్రిప్ట్ సంతృప్తి కరంగా లేకపోవడం వలన ప్రాజెక్టు రద్దు
- సొంత బ్యానర్లో ఎంట్రీ ఇచ్చే అవకాశం
కథ ఈనాటి యూత్ కి కనెక్ట్ అయ్యేలా లేకపోవడం వలన .. స్క్రిప్ట్ సంతృప్తి కరంగా రాకపోవడం వలన ఈ సినిమాను ఆపేస్తున్నట్టుగా గల్లా జయదేవ్ కి .. మహేశ్ బాబుకి దిల్ రాజు సమాచారాన్ని అందించినట్టుగా చెప్పుకుంటున్నారు. మరో మంచి ప్రాజెక్టుతో గల్లా అశోక్ ను లాంచ్ చేయడం మంచిదనే అభిప్రాయాన్ని దిల్ రాజు వ్యక్తం చేశాడట. ఈ నేపథ్యంలో సొంత బ్యానర్లో గల్లా అశోక్ ను రంగంలోకి దింపే ప్రయత్నాలు జరుగుతున్నాయనే ప్రచారం జరుగుతోంది.