సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం
- ముందుగా భాషపై దృష్టి పెడుతుందట!
- శిక్షణ కోసం అమెరికాకు వరుణ్ తేజ్
- రచయితకు సుధీర్ బాబు గ్రీన్ సిగ్నల్
* తాజాగా తాను చేసిన 'ఎఫ్ 2' చిత్రానికి హిట్ టాక్ రావడంతో హీరో వరుణ్ తేజ్ హ్యాపీ మూడ్ లో వున్నాడు. ఆ ఆనందంలో తన తదుపరి చిత్రానికి సంబంధించి బాక్సింగ్ లో మూడు నెలల శిక్షణ పొందేందుకు ఈ నెలాఖరున లాస్ ఏంజిల్స్ వెళుతున్నాడు. నూతన దర్శకుడు కిరణ్ కొర్రపాటి దర్శకత్వం వహించే ఈ చిత్రాన్ని అల్లు అరవింద్ పెద్దబ్బాయి అల్లు వెంకటేశ్ నిర్మిస్తాడు.
* సుధీర్ బాబు హీరోగా ప్రముఖ రచయిత హర్షవర్ధన్ దర్శకత్వంలో ఓ చిత్రాన్ని నిర్మించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. హర్ష చెప్పిన కథ సుధీర్ బాబుకి నచ్చడంతో గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట.