కొత్త లుక్ తో వచ్చిన గోపీచంద్
- తిరు దర్శకత్వంలో గోపీచంద్
- తదుపరి సినిమా సంపత్ నందితో
- త్వరలో పూర్తి వివరాలు
సాధారణంగా గోపీచంద్ కథాకథనాలపై దృష్టి పెడతాడేగానీ, లుక్స్ మార్చాలనే ఆలోచన చేయడు. కానీ ఈ సినిమాలో మాత్రం ఆయన కొత్త లుక్ తో కనిపించడానికి రెడీ అవుతున్నాడు. ఆ లుక్ కి సంబంధించిన స్టిల్ ఒకటి బయటికి వచ్చింది. నిజంగానే ఈ లుక్ లో గోపీచంద్ చాలా కొత్తగా కనిపిస్తున్నాడు. ఈ సినిమా తరువాత సంపత్ నంది దర్శకత్వంలో గోపీచంద్ ఒక సినిమా చేయనున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఈ ఇద్దరి కాంబినేషన్లో గతంలో 'గౌతమ్ నంద' తెరకెక్కిన సంగతి తెలిసిందే. త్వరలోనే కొత్త ప్రాజెక్టుకి సంబంధించిన వివరాలు తెలియనున్నాయి.