సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం
- నాని నిర్మించే సినిమాలో సమంత
- 'అదుర్స్'కి స్క్రిప్ట్ రెడీ అయిందట!
- మహేశ్ తో బోయపాటి ప్రాజక్ట్
* ఎన్టీఆర్, వీవీ వినాయక్ కాంబినేషన్లో గతంలో వచ్చిన 'అదుర్స్' సినిమా మంచి హిట్టవడంతో దానికి సీక్వెల్ చేయాలనే ఆలోచన చేస్తున్న సంగతి విదితమే. సీక్వెల్ తప్పకుండా చేస్తానని ఎన్టీఆర్ కూడా చాలా సార్లు చెప్పాడు. ఈ క్రమంలో అదుర్స్ రచయిత కోన వెంకట్ తాజాగా చెబుతూ, అదుర్స్ సీక్వెల్ కి స్క్రిప్ట్ రెడీ అయిందని, ఇక ఎన్టీఆర్ ఈ చిత్రానికి డేట్స్ కేటాయించడమే తరువాయని చెప్పాడు.
* తాజాగా చరణ్ హీరోగా 'వినయ విధేయ రామ' చిత్రాన్ని చేసిన దర్శకుడు బోయపాటి శ్రీను త్వరలో మహేశ్ బాబుతో కూడా చేయనున్నాడట. ఈ విషయాన్ని తాజాగా తనే చెబుతూ, మహేశ్ బాబుతో తప్పకుండా ఒక చిత్రం వుందని తెలిపాడు.