ప్రాణం ఉన్నంత వరకూ టీడీపీలోనే కొనసాగుతాం: భూమా బ్రహ్మానందరెడ్డి
- టీడీపీతోనే మొదలైంది.. టీడీపీతోనే ముగుస్తుంది
- అవన్నీ అవాస్తవాలే...
- నా గెలుపును చంద్రబాబుకు కానుకగా ఇస్తా
ఈ సందర్భంగా బ్రహ్మానందరెడ్డి మాట్లాడుతూ.. పార్టీ మారుతున్నట్టు వచ్చిన వార్తలను అవాస్తవాలుగా కొట్టి పడేశారు. ప్రాణం ఉన్నంత వరకూ టీడీపీలోనే కొనసాగుతామని స్పష్టం చేశారు. భూమా కుటుంబ రాజకీయ ప్రస్థానం టీడీపీతోనే మొదలైందని.. టీడీపీతోనే ముగుస్తుందని వెల్లడించారు. అంతకు ముందు అఖిల ప్రియ మాట్లాడుతూ పార్టీ మారాల్సిన కర్మ తమకు పట్టలేదని.. వచ్చే ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగానే పోటీ చేస్తానని.. తన గెలుపును చంద్రబాబుకు కానుకగా ఇస్తానని తెలిపారు.